బాలీవుడ్ సినిమాలో న‌టించాల‌నుకుంటున్న హాలీవుడ్ న‌టుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ సినిమాలో న‌టించాల‌నుకుంటున్న హాలీవుడ్ న‌టుడు

  • ట్వీట్ ద్వారా వెల్ల‌డించిన జాడెన్ స్మిత్‌
  • ఇటీవ‌ల భార‌త్ వ‌చ్చిన జాడెన్ తండ్రి విల్ స్మిత్‌
  • న‌వ్వు పుట్టించే కామెంట్లు చేస్తున్న నెటిజ‌న్లు
ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు విల్ స్మిత్ కుమారుడు జాడెన్ స్మిత్, బాలీవుడ్‌ సినిమాలలో న‌టించాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ విష‌యాన్ని అత‌ను ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. 'నాకు బాలీవుడ్ సినిమాలో న‌టించాల‌ని ఉంది' అని జాడెన్ స్మిత్ సింపుల్‌గా ట్వీట్ చేశాడు. ఇటీవ‌ల విల్ స్మిత్ భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. త‌న చిత్రం 'బ్రైట్‌' ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ఇండియా వ‌చ్చారు. ఈ ప్ర‌భావ‌మే జాడెన్ మీద ప‌డి ఉంటుంద‌ని నెటిజన్లు అంటున్నారు.

అంతేకాకుండా బాలీవుడ్ సినిమాలో న‌టించాల‌న్న జాడెన్ ఆశ‌కి సృజ‌నాత్మ‌క‌త జోడించి, న‌వ్వు పుట్టించే కామెంట్లు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. 'క‌రాటే కిడ్‌', 'ఆఫ్ట‌ర్ ఎర్త్' సినిమాల‌తో పాటు ఇటీవ‌ల విడుద‌లైన 'సైర్‌' ఆల్బ‌మ్‌తో జాడెన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.
will smith
jaden smith
hollywood
Bollywood

More Telugu News