ఈ ఘోరమైన యాక్సిడెంట్ ఎలా జరిగింది...?: ఆర్టీసీ డ్రైవర్ వర్షన్ ఇది
- విద్యార్థినుల ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
- ఐదుగురు దుర్మరణం
- బస్సును ఆటో ఓవర్ టేక్ చేయబోయిందన్న డ్రైవర్
- యాక్సిండెంట్ తో బాధ కలుగుతోందని వెల్లడి
ప్రమాద సమయంలో బస్సు మితిమీరిన వేగంతో వెళ్లడం లేదని చెప్పిన ఆయన, బస్సు ఓ టర్నింగ్ వద్దకు రాగానే, వెనక నుంచి వస్తున్న ఆటో, బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేసిందని అన్నాడు. ఈ క్రమంలో ఆటోనే అదుపుతప్పి బస్సును ఢీకొందని, పొగమంచు కారణంగా వెనక వస్తున్న ఆటో తనకు కనిపించలేదని అన్నాడు. ఈ ఘటనలో నలుగురు బాలికలు చనిపోవడం తనకెంతో బాధను కలిగిస్తోందని చెప్పాడు. వెంటనే తాను బస్సును ఆపి ఆటోలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు సాయం చేశానని చెప్పాడు. రోడ్డు మధ్యలో డివైడర్ లేకపోవడం, పొగమంచు కమ్మేయడం ప్రమాదానికి కారణాలన్నాడు.