వచ్చేస్తున్న 'ఎన్టీఆర్'... అభిమానుల వెల్లువతో సందడిగా రామకృష్ణా స్టూడియోస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చేస్తున్న 'ఎన్టీఆర్'... అభిమానుల వెల్లువతో సందడిగా రామకృష్ణా స్టూడియోస్!

  • మరికాసేపట్లో 'ఎన్టీఆర్' షూటింగ్ ప్రారంభం
  • మహా నేత జీవిత కథ ఆధారంగా చిత్రం
  • దర్శకత్వం వహిస్తున్న తేజ
బాలకృష్ణ కథానాయకుడిగా, తేజ దర్శకత్వంలో నిర్మించ తలపెట్టిన మహా నటుడు, దివంగత నేత నందమూరి తారక రామారావు బయోపిక్ షూటింగ్ రామకృష్ణా స్టూడియోస్ లో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో స్టూడియో వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ చిత్రానికి కొర్రపాటి సాయి, ఇందూరి విష్ణులతో పాటు బాలకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టీజర్ ను జనవరి 18న విడుదల చేయాలన్న నిశ్చయంతో ఉన్న టీమ్, తొలుత టీజర్ ను షూట్ చేస్తుందని సమాచారం.
Balakrishna
Teja
NTR
Bio Pic

More Telugu News