సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అంత తేలిగ్గా వదలనంటున్న రకుల్!
  • 'జైసింహా'కు గుమ్మడికాయ పూజ 
  • 'వీర మహాదేవి'గా సన్నీ లియోన్ 
  • చైతూకి అక్కగా నిన్నటి నాయిక!
*  సాధారణంగా నాకొక అవకాశం వచ్చిందంటే తేలిగ్గా దానిని వదిలేయను.. అంటోంది ప్రెట్టీ డాల్ రకుల్ ప్రీత్ సింగ్. "ఈ రోజుల్లో ఆఫర్ రావడమే పెద్ద గొప్ప. అందుకే, ఏమాత్రం నచ్చినా దానిని వదులుకోను. అందులోనూ లవ్ స్టోరీస్ అయితే అస్సలు వదలను, అలాంటి సినిమాల ద్వారానే హీరోయిన్లకు మంచి పేరొస్తుంది కదా!" అంటూ చెప్పుకొచ్చింది.      
*  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జైసింహా' షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయింది. దీనిని పురస్కరించుకుని షూటింగ్ లొకేషన్ లో నిన్న గుమ్మడికాయ పూజ నిర్వహించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
*  బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. వీసీ వడివుడాయిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు 'వీర మహాదేవి' అనే టైటిల్ని నిర్ణయించారు. ఈమేరకు టైటిల్ లోగోను విడుదల చేశారు. ఇందులో నవదీప్ హీరోగా నటిస్తున్నాడు.
*  ఇటీవల విడుదలైన 'ఎంసిఏ' చిత్రంలో హీరో నానికి వదిన పాత్రలో నటించిన ప్రముఖ నటి భూమిక తాజాగా అక్కినేని నాగచైతన్యకు అక్కగా నటించడానికి అంగీకరించింది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో చైతూకి అక్కగా భూమిక ముఖ్య పాత్ర పోషిస్తోంది.  
Rakul
Balakrishna
Sunny Leone
Bhumika

More Telugu News