ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో సీట్లు సంపాదించిన గురుకులాల విద్యార్థులు!: మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశంసలు
- ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్ఐఎఫ్టీ లాంటి సంస్థల్లో సీట్లు
- విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందించిన మంత్రి
- అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దని నిరూపించారు
- సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యావకాశాలు ఉండాలి
దేశంలో ప్రతిష్ఠాత్మక విశ్వ విద్యాలయాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు సీట్లు సాధించడం గొప్ప విషయమని, వారికి అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దని నిరూపించారని మంత్రి అభినందించారు. తెలంగాణలోనే నాణ్యమైన విద్యతో పాటు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యనందించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకునేలా ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
తెలంగాణ గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబరచి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సెక్రటరీ, అధ్యక్షులు, ప్రిన్సిపాల్, టీచర్ల కృషికి ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యావకాశాలు ఉండాలన్న భావంతో ప్రభుత్వం గురుకులాల సంఖ్య పెంచడంతో పాటు, మంచి భోజన వసతిని అందిస్తున్నామని అన్నారు.