శ్రీలంక అభిమానిని రిసెప్షన్‌కి ఆహ్వానించిన విరుష్క జంట.. ఆనందడోలికల్లో అభిమాని!
- విరాట్ అండర్ 19 ఆడుతున్నపుడు పరిచయమైన అభిమాని
- ఆనందం వ్యక్తం చేసిన గయాన్ సేననాయకే
- సెలెబ్రిటీలతో ఫొటోలు దిగిన గయాన్
ఆ వ్యక్తి పేరు గయాన్ సేననాయకే. విరుష్కల రిసెప్షన్ కోసం శ్రీలంక నుంచి వచ్చాడు. 2007లో మలేసియాలో విరాట్ అండర్-19లో ఆడుతున్నపుడు గయాన్‌ను మొదటిసారిగా కలిశాడు. అప్పట్నుంచి ఇక ప్రతి మ్యాచులోనూ విరాట్, గయాన్లు కలిసే వారు. అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహాన్ని గుర్తుపెట్టుకుని విరాట్, గయాన్ని రిసెప్షన్‌కి ఆహ్వానించాడు. అందుకు తను చాలా ఆనందపడుతున్నానని గయాన్ వెల్లడించాడు. అదే రిసెప్షన్‌కి హాజరైన సెలెబ్రిటీలను చూసి తాను ఉబ్బితబ్బిబ్బైనట్లు గయాన్ తెలిపాడు. అంతేకాదు.. తాను సచిన్, జడేజా వంటి క్రికెటర్లతో పాటు, బాలీవుడ్ తారలతో కూడా సెల్ఫీలు తీసుకున్నట్లుగా గయాన్ చెప్పాడు.