బ్లూ వేల్ మత్తులో యువకుడు... పోలీసులను పరుగులు పెట్టించిన వైనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్లూ వేల్ మత్తులో యువకుడు... పోలీసులను పరుగులు పెట్టించిన వైనం!

  • బ్లూవేల్‌ గేమ్ బారిన ప‌డ‌డ‌మే కార‌ణం
  • తాజాగా ఓ చోట‌ బాంబు ఉందని ఫోన్‌కాల్ చేసిన ఎంసీఏ విద్యార్థి
  • చివ‌ర‌కు పోలీసుల‌కు లొంగిపోయిన వైనం
  • హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘ‌ట‌న‌
బ్లూవేల్ ఆన్‌లైన్‌ గేమ్ భూతం బారిన మ‌రో యువ‌కుడు ప‌డ్డాడు. ఎంసీఏ విద్యార్థి సందీప్‌కుమార్ (21) బ్లూవేల్ గేమ్ ఆడుతూ అందులో భాగంగా  హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండిలోని అంతర్రాష్ట్ర ప్రయాణ ప్రాంగణంలో బాంబు ఉందని పోలీసులకు అస‌త్యాలు చెప్పి వారిని ప‌రుగులు పెట్టించాడు. చివ‌ర‌కు స్వ‌యంగా వ‌చ్చి పోలీసులకు లొంగిపోయాడు. బ్లూవేల్‌లో అలా చేయ‌మ‌న్నార‌ని అందుకే చేశాన‌ని చెప్పాడు. గతంలో తాను బ్లూవేల్‌లో భాగంగా త‌న బైక్‌ని అతి వేగంగా నడిపి ఆత్మహత్యాయ‌త్నం చేశాన‌ని తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌ల‌పై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.
blue whale
game
student
suicide attempt

More Telugu News