సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • షరతులు లేవంటున్న రాశిఖన్నా 
  • సెన్సార్ కి వెళుతోన్న 'అజ్ఞాతవాసి'
  • వీరు పోట్లకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ 
  • 'తొలిప్రేమ' కోసం ఫైట్ చేస్తున్న వరుణ్ తేజ్
*  'ఇలాంటి పాత్రలే చేస్తాను.. అలాంటివి చేయను అన్న షరతులు నేను పెట్టుకోలేదు' అంటోంది యంగ్ హీరోయిన్ రాశిఖన్నా. "నన్ను ఎలాంటి పాత్రల్లో చూపించాలో దర్శకులకు తెలుసు. అందుకే, ఈ విషయంలో లిమిటేషన్స్ ఏమీ పెట్టుకోలేదు. ఎటువంటి పాత్రలొచ్చినా చేసుకుంటూ పోవడమే నా డ్యూటీ" అంటూ చెప్పుకొచ్చింది రాశి.
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం ఈ నెల 29న సెన్సార్ కు వెళుతోంది. కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  
*  గత కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్ తాజాగా మరో చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. 'రగడ', 'బిందాస్', 'దూసుకెళ్తా' వంటి చిత్రాలను రూపొందించిన వీరు పోట్ల చెప్పిన కథకు గోపీచంద్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'తొలిప్రేమ' చిత్రంకు సంబంధించిన ఓ ఫైట్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాదులోని ఓ కాలేజీ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేస్తారు. 
Rashikhanna
Pawan Kalyan
gopichand
Varun

More Telugu News