మంద కృష్ణమాదిగకు బెయిల్‌ మంజూరు.. రేపు విడుదల!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంద కృష్ణమాదిగకు బెయిల్‌ మంజూరు.. రేపు విడుదల!

  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు 
  • బెయిల్ ఆర్డర్ కాపీ జాప్యంతో విడుదల రేపటికి వాయిదా 
  • చంచల్ గూడ జైలు వద్ద పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు షరతులతో కూడిన బెయిల్ ను సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఈరోజు మంజూరు చేసింది. అయితే, బెయిల్ ఆర్డర్ కాపీ అందడం జాప్యం కావడంతో ఈరోజు ఆయన విడుదల కాలేదు. రేపు ఉదయం 10 గంటలకు ఆయనను విడుదల చేయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

చంచల్ గూడ జైలులో ఉన్న మంద కృష్ణను ఈరోజు విడుదల చేస్తారని భావించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే, ఈరోజు ఆయన్ని విడుదల చేయడం లేదని తెలిసి నిరుత్సాహపడ్డారు. కాగా, ఈ నెల 17న నిర్వహించిన ‘మాదిగ మిలియన్ మార్చ్’కు మంద కృష్ణ పిలుపునిచ్చారు. అయితే, పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలో మంద కృష్ణను పోలీసులు ఆ రోజు అరెస్టు చేశారు.
mrps
manda krishna

More Telugu News