Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అన్నాడీఎంకే ఓటమికి తెలుగువారు, హీరో విశాల్ కారణం: కేతిరెడ్డి

  • ఆర్కే నగర్ కు దినకరన్ చేసిందేమీ లేదు
  • ఈ ఎన్నికల్లో డబ్బే గెలిచింది
  • తమిళనాడులో బీజేపీ జీరో
ఆర్కే నగర్ ఉపఎన్నికలో శశికళ మేనల్లుడు దినకరన్ ఘన విజయం సాధించగా... అన్నాడీఎంకేకు ఘోర పరాభవం ఎదురైంది. ఈ సందర్భంగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ, దినకరన్ విజయానికి, అన్నాడీఎంకే ఓటమికి తెలుగు ఓటర్లే కారణమని చెప్పారు. హీరో విశాల్ నామినేషన్ ను అధికార అన్నాడీఎంకే నేతలు రద్దు చేయించారనే ఆరోపణలు రావడం కూడా ఆ పార్టీని దెబ్బతీసిందని అన్నారు. దినకరన్ గెలుపుకు కేవలం డబ్బు మాత్రమే కారణమని... ఇప్పటి వరకు ఆర్కే నగర్ కు ఏం చేశారో దినకరన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆర్కే నగర్ లో నిరుపేద ఓటర్లు ఎక్కువగా ఉన్నారని... వారికి భారీ మొత్తంలో నగదు పంపిణీ చేశారని... దినకరన్ విజయానికి ఇదే కారణమని కేతిరెడ్డి చెప్పారు. రెండాకుల గుర్తు వచ్చిందనే ధీమాలో అన్నాడీఎంకే ఉండిపోయిందని... గుర్తు కంటే డబ్బే గొప్పది అనే విషయాన్ని వారు విస్మరించారని అన్నారు. ఎన్నికలకు ఒక రోజు ముందు జయలలిత వీడియోను విడుదల చేయడం కూడా దినకరన్ కు కలిసొచ్చిందని చెప్పారు. తమిళనాడులో బీజేపీ రావడం అసాధ్యమనే విషయం ఈ ఎన్నికలతో తేలిపోయిందని తెలిపారు. దినకరన్ గెలుపుతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. 
rk nagar
dinakaran
kethireddy jagadiswar reddy
aiadmk

More Telugu News