Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 499కే ఫీచ‌ర్ ఫోన్‌ అంద‌జేస్తున్న డెటెల్ కంపెనీ

  • బీఎస్ఎన్ఎల్‌తో ఒప్పందం
  • సింగిల్ సిమ్‌, 650 ఎంఏహెచ్ బ్యాట‌రీ
  • రూ. 103 టాక్‌టైమ్ అంద‌జేయ‌నున్న టెలికాం సంస్థ‌
భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్‌)తో క‌లిసి మొబైల్ త‌యారీ సంస్థ డెటెల్ ఓ ఫీచ‌ర్‌ఫోన్‌ని మార్కెట్లోకి విడుద‌ల చేసింది. దీని ధ‌ర కేవ‌లం రూ. 499 మాత్ర‌మే. డెటెల్ డీ1 పేరుతో ఈ ఫోన్‌ను ఆవిష్క‌రించారు. దీంతో క‌లిసి వ‌చ్చే బీఎస్ఎన్ఎల్ క‌నెక్ష‌న్‌తో రూ. 103 టాక్‌టైమ్ వ‌స్తుంది. అంతేకాకుండా సంవ‌త్స‌రం పాటు బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్‌కి నిమిషానికి 15 పైస‌లు, ఇత‌ర ఫోన్ల‌కు నిమిషానికి 40 పైస‌లు ఛార్జీ ప‌డే ప్లాన్‌ని కూడా ఇవ్వ‌నున్నారు.

ఇక ఈ ఫోన్లో ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. సింగిల్ సిమ్‌, 1.44 ఇంచుల మోనోక్రోమ్ డిస్‌ప్లే, 650 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం, టార్చిలైట్‌, ఫోన్‌బుక్‌, ఎఫ్ఎం రేడియో వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ల కంటే ఫీచ‌ర్ ఫోన్లకి భార‌త్‌లో ఇప్ప‌టికీ డిమాండ్ ఉంద‌ని, అందుకే పెద్ద మొత్తంలో ఈ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు డెటెల్ ఎస్ జీ ఎండీ యోగేశ్ భాటియా తెలిపారు.
bsnl
detel
feature phone

More Telugu News