వెంకీ .. రానా కాంబినేషన్లో వెబ్ సీరీస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకీ .. రానా కాంబినేషన్లో వెబ్ సీరీస్!

  • వెంకీతో కలిసి నటించనున్న రానా 
  • రాజీవ్ గాంధీ హత్యకి సంబంధించిన కథాంశం 
  • ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ
వెంకటేశ్ .. రానా ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నట్టుగా కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరితో మల్టీ స్టారర్ చేయడానికి సురేశ్ బాబు గట్టి ప్రయత్నమే చేశాడు. అయితే, అందుకోసం ఆయన విన్న కథలు సంతృప్తికరంగా అనిపించలేదట. దాంతో ప్రస్తుతానికి ఆయన ఆ ఆలోచనను పక్కన పెట్టేసి, వేరే కథలపై దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే వెంకీ .. రానా కలిసి నటించడం మాత్రం ఖరారైపోయింది.

అలా అని చెప్పేసి వాళ్లు వేరే బ్యానర్లో చేస్తున్నారనుకుంటే పొరపాటే. వాళ్లు చేస్తున్నది సినిమా కాదు.. వెబ్ సిరీస్. రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన కథాంశంతో ఒక వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో చేయడానికి ఆల్రెడీ రానా ఓకే చెప్పేశాడు. తాజాగా వెంకటేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వెంకీ .. రానా ఇద్దరూ కలిసి 3 ఎపిసోడ్స్ లో కనిపించనున్నారని సమాచారం. ఇంతకు ముందు రానా కొన్ని వెబ్ సిరీస్ లలో నటించాడు .. వెంకటేశ్ కి మాత్రం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా వున్నారు. 
rana
venkatesh

More Telugu News