40 ఏళ్ల వయసులో కూడా తండ్రి చేతిలో చెంప దెబ్బలు తిన్న అల్లు అరవింద్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

40 ఏళ్ల వయసులో కూడా తండ్రి చేతిలో చెంప దెబ్బలు తిన్న అల్లు అరవింద్!

  • ఒకరోజు ఇద్దరం కారులో బయల్దేరాం 
  • మధ్యలో సడన్ బ్రేక్ వేస్తే, ఒక్కటిచ్చారు
  • నాన్న కోపాలు నాకు మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, ఆయన తండ్రి అల్లు రామలింగయ్యలు ఎంతో క్లోజ్ గా ఉండేవారట. ఇదే సమయంలో పొరపాటు చేస్తే మాత్రం రామలింగయ్య సీరియస్ గా ఉండేవారట. 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అరవింద్ ను ఆయన తండ్రి చెంపమీద ఫెడేల్మని ఒకటి ఇచ్చారట. ఈ ఆసక్తికర విషయాన్ని స్వయంగా అరవిందే చెప్పారు.

ఒకరోజు తాను, నాన్న ఇద్దరం కలసి బయటకు వెళ్లామని... తాను డ్రైవ్ చేస్తుంటే, నాన్న పక్కన కూర్చున్నారని... మధ్యలో తాను సడన్ గా బ్రేక్ వేశానని... దాంతో, ఆయన అమాంతం ముందుకు ఒరిగిపోయారని, బ్యాలన్స్ కోసం అద్దానికి చేయి ఆనిచ్చారని తెలిపారు. దీంతో, ఆగ్రహంతో ఫట్ మని తన చెంపపై ఒక్కటి ఇచ్చారని చెప్పారు. అసలేం జరిగిందో ఒక్క క్షణం తనకు అర్థం కాలేదని అన్నారు.

40 ఏళ్ల వయసున్న ఓ కొడుకును తండ్రి కొట్టారంటే... ఆ కొడుకుని ఇంకా చిన్న పిల్లాడిగానే చూసినట్టు కాదా? అని అన్నారు. కొడుకు ప్రొడ్యూసర్ అయినా... ఒక తండ్రికి కొడుకే అని చెప్పారు. ఆయన కోపాలు తనకు మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని చెప్పారు. 'సాక్షి' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ ఈ విషయాన్ని తెలిపారు.

allu aravind
allu ramalingaiah

More Telugu News