Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి క్రిస్‌మ‌స్ వేడుక చేసుకుంటున్న సోన‌మ్ క‌పూర్‌

  • వ్యాపారవేత్త ఆనంద్ అహూజాతో దిగిన ఫొటోలను షేర్ చేసిన న‌టి
  • తమ రిలేష‌న్‌పై ఇప్ప‌టికీ స్ప‌ష్టత ఇవ్వ‌ని సోన‌మ్‌
  • చ‌క్క‌ర్లు కొడుతున్న కొత్త పుకార్లు
బాలీవుడ్ న‌టి సోన‌మ్ క‌పూర్‌, వ్యాపార‌వేత్త ఆనంద్ అహూజాతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై ఆమె స్పందిస్తూ అలాంటిదేం లేద‌ని, 'మీకు వేరే ప‌నులు లేవా?' అంటూ మీడియాపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం కూడా తెలిసిందే. కానీ త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం మాత్రం మాన‌డం లేదు. దీంతో ఆ వార్త‌ల పుకార్లు మ‌రింత పేట్రేగిపోతున్నాయి.

ప్ర‌స్తుతం లండ‌న్‌లోని థేమ్స్ న‌ది ఒడ్డున ఆమె, అహూజాతో క‌లిసి క్రిస్‌మ‌స్ వేడుక‌లు జ‌రుపుకుంటోంది. దీనికి సంబంధించి ఆమె ఇన్‌స్టాగ్రాంలో స్టోరీలు పెట్టింది. ఈ స్టోరీలు చూసిన వారంద‌రికీ వారిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌న్న అనుమానం వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. అంతేకాకుండా ఆనంద్ అహూజా కూడా సోన‌మ్‌తో ఉన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు.
sonam kapoor
anand ahuja
love
birds
instagrams

More Telugu News