ప్రభుదేవా నాకు ఛాన్స్ ఇచ్చారు .. ఆ రాత్రి నిద్ర పట్టలేదు!: శేఖర్ మాస్టర్

  • కొరియోగ్రఫీలో ప్రభుదేవా ఒక లెజెండ్ 
  • ఆయన ముందు పనిచేయడమంటే మాటలా? 
  • ఆయన అలా చేయడాన్ని మరచిపోలేకపోయాను  
తెలుగులోని అగ్రకథానాయకులందరికీ తన కొరియోగ్రఫీని అందిస్తూ శేఖర్ మాస్టర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుదేవా సినిమాకి పనిచేయవలసి వచ్చింది. ఆ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " బాలీవుడ్లో నేను 'యాక్షన్ జాక్సన్' సినిమా చేశాను. నేను ఇక్కడ చేసిన 'ఇద్దరు అమ్మాయిలతో' సినిమాలో 'టాపు లేచిపోద్ది ..' సాంగ్ చూసిన ప్రభుదేవా గారు పిలిపించారు. 'యాక్షన్ జాక్సన్' సినిమాకి ఆయన దర్శకుడు .. రెండు సాంగ్స్ నన్ను చేయమన్నారు.

డాన్స్ లో ప్రభుదేవా లెజెండ్ .. అలాంటి ఆయన పిలిచి 'నా సినిమాలో సాంగ్ చేస్తావా?' అని అడిగితే .. 'అయ్యో, ఎందుకు చేయను సార్?' అన్నాను. ఆయన ఎంతో పెద్ద కొరియో గ్రాఫర్ అయ్యుండి .. హీరోకి గానీ .. హీరోయిన్ కి గాని మూమెంట్ రాకపోతే, 'శేఖర్ .. మూమెంట్ రావడం లేదట .. వెళ్లి చెప్పు' అంటారు. గురువు లాంటి ఆయన ముందు వెళ్లి ఆర్టిస్టులకు చెప్పాలంటే మాటలా? ఒక్కోసారి నేను కంపోజ్ చేసిన మూమెంట్ ను మాస్టర్ వెళ్లి ఆర్టిస్టులతో చేయించేవారు  .. అంతకన్నా ఏం కావాలి? ఆయన అలా చేసినప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు" అంటూ చెప్పుకొచ్చారు.   
Go Back to Shorts
prabhudeva
sekhar master

More Telugu News