దేవుడికి కిరీటం ఇచ్చాను... కాపాడలేదు... వైఎస్ పోయారు, కష్టాలు వచ్చాయి: గాలి కీలక వ్యాఖ్యలు
- సంపాదించిన డబ్బుతోనే వెంకన్నకు కిరీటం
- గనుల వ్యాపారంలో రూ. 2 వేల కోట్లు పన్ను కట్టాను
- హెలికాప్టర్ కొన్నది సమయాన్ని ఆదా చేసుకోవడానికే
- తన విధిరాత బాగోలేదన్న గాలి
ఇప్పుడు తాను ఎవరినీ నిందించడం లేదని అది విధిరాతని, దాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు. ఒకప్పుడు తనకు తొందరపాటు తనం ఉండేదని, ఇప్పుడు పరిణతి చెందానని అన్నారు. ప్రతి విషయంలోనూ సహనంతో ఉండి ఎదుర్కోవాలే తప్ప ఆవేశంతో ఎదురు తిరిగితే నష్టపోతామని కూడా అర్థమైందని చెప్పారు. తనకు వచ్చిన సంపద మరికొంత కాలం తరువాత వచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. భయపడుతూ బతకాల్సిన అవసరం తనకు లేదని, బళ్లారిలో తాను చేసే సామూహిక వివాహాలే వైభవంగా జరుగుతాయని, తన కుమార్తె పెళ్లిని ఆ మాత్రం ఘనంగా చేయకుంటే తృప్తి ఎలా ఉంటుందని ప్రశ్నించారు.