దినకరన్ ఘన విజయంపై జైల్లో ఉన్న శశికళ స్పందన!
- దినకరన్ విజయంపై ఆనందం
- కోట్లాది మంది దినకరన్ వెంట ఉన్నారు
- ఆర్కే నగర్ అభివృద్ధికి కృషి చేయాలి
ఈ నేపథ్యంలో, బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో ఉన్న శశికళ స్పందించారు. దినకరన్ ఘన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. జైలు అధికారుల ద్వారా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది మంది కార్యకర్తలు దినకరన్ వెంట ఉన్నారని, ఆయనకు సహాయ సహకారాలు అందిచారని చెప్పారు. అమ్మ జయలలిత రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆర్కే నగర్ అభివృద్ధికి దినకరన్ కృషి చేయాలని తన శుభాకాంక్షల లేఖలో పేర్కొన్నారు.