Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైలులో లాలూకు సౌకర్యాలు.. ఇంటిభోజనం అనుమతి!

  • బిర్సా ముందా జైలులో ఉన్న ఆర్జేడీ అధినేత
  • లాలూకు కొన్ని సౌకర్యాలు కల్పించిన అధికారులు
  • తోటి ఖైదీలు కలిసేందుకు అనుమతి లేదు  
దాణా కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కొన్ని సౌకర్యాలు కల్పించారు. రాంచీలోని బిర్సా ముందా జైలులో ఉన్న లాలూకు వార్తాపత్రిక, టీవీ, దోమతెర, ఇంటి భోజనం వంటి సౌకర్యాలను అధికారులు కల్పించారు. లాలూ ఇక్కడి జైల్లో ఉన్నంత వరకూ తోటి ఖైదీలు ఆయన్ని కలిసేందుకు, ఆ సెల్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదు. కాగా, 2014లో లాలూకు గుండె శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి లాలూ ఆహార విషయాల్లో పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కాగా, ఇదే కేసులో 2013లో లాలూ అరెస్టు అయినప్పుడు కూడా ఇదే సెల్ లో ఆయన ఉండటం గమనార్హం.
lalu
bihar

More Telugu News