చేప పాత్ర‌కు వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్న నాని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చేప పాత్ర‌కు వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్న నాని!

  • ‘అ!’ చిత్రానికి నాని నిర్మాత‌
  • ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
  • 'ఈ పాత్ర కోసం ఈత నేర్చుకున్నా' అని ట్వీట్‌
వాల్‌పోస్ట‌ర్ బ్యాన‌ర్ పేరుతో నాని నిర్మాత‌గా అవ‌తారం ఎత్తి ‘అ!’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ చేప పాత్రకు నాని వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. ప్ర‌శాంత వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నాని వాయిస్ ఇస్తున్న చేప పాత్ర కీల‌క‌మైంద‌ని స‌మాచారం. త‌న పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ని నాని షేర్ చేశారు

‘పరోపకారం చేసే చేపగా ‘అ!’లో నేచురల్‌స్టార్‌ నాని’ అనే పోస్టర్‌ను పోస్ట్ చేసి ‘నా తర్వాతి చిత్రంలో ఓ ఆసక్తికర పాత్రను పోషిస్తున్నా. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేయటంతో ఈదడం నేర్చుకుంటున్నా’ అంటూ చమత్కారంతో ట్వీట్‌ చేశారు. ‘అ!’ చిత్రంలో నిత్యామేనన్‌, కాజల్‌, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చేపతో పాటు మరో ప్రాణి కూడా ఇందులో కనిపించనుంది. దానికి రవితేజ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
nani
fish
awe

More Telugu News