హారికకు ఓ నిర్మాత కుమారుడితో లవ్ మ్యాటర్ వుంది.. గంగిరెడ్డితో కూడా ఆమెకు పరిచయం వుంది!: డైరెక్టర్ యోగి
- పది వేల కోసం పిలిచారు
- అప్పటికప్పుడు కంప్లైంట్ రాయించారు
- నేను చెప్పేది వినలేదు
పది వేల గురించి పిలవడం దారుణం అని అన్నందుకే... అప్పటికప్పుడు హారిక చేత తనపై కంప్లైంట్ రాయించారని యోగి అడిషనల్ డీసీపీపై ఆరోపించారు. హారికకు ఓ నిర్మాత కుమారుడితో లవ్ మ్యాటర్ ఉందని... ఇది తనతో పాటు మరొకరికి కూడా తెలుసని... ఈ విషయం బయటకు పొక్కడంతో, ఇతరులకు చెప్పింది తానే అని హారిక భావించిందని... 'నా విషయాలు బయటకు చెబుతావా.. నీ పరువు కూడా తీస్తా' అంటూ తనను హెచ్చరించిందని చెప్పాడు. ఈ క్రమంలో కొంతమేర వాదోపవాదాలు జరిగాయని తెలిపాడు.
విచారణ సందర్బంగా తన ఫోన్ లో అమ్మాయిల న్యూడ్ ఫొటోలు ఉన్నాయంటూ గంగిరెడ్డి మొబైల్ ను లాక్కున్నారని... మొత్తం చెక్ చేసినా అభ్యంతరకరమైనది ఏదీ దొరకలేదని యోగి అన్నాడు. ఒక డైరెక్టర్ గా కొందరు యాక్టర్ల ప్రొఫైల్స్ తన వద్ద ఉండటం సహజమేనని చెప్పాడు. దాదాపు 600 మంది ఫొటోలు తన వద్ద ఉంటాయని... అయితే, తనను అమ్మాయిలను సప్లై చేసే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. జరిగిన వాస్తవాలను తాను చెబుతున్నప్పటికీ అడిషనల్ డీసీపీ పట్టించుకోలేదని అన్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే, ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమేనని చెప్పాడు.
గంగిరెడ్డితో హారికకు ఇంతకు ముందు నుంచే పరిచయం ఉందని... ఆమెకు ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పేదని... ఈ నేపథ్యంలోనే, పది వేల కోసం మళ్లీ ఆయనను కలిసిందని యోగి తెలిపాడు. తనకు పనిష్ మెంట్ ఎందుకిచ్చారో అర్థంకావడం లేదని అన్నాడు. ఎంక్వైరీ సరిగా చేయలేదని... తాను చెప్పే విషయాలను పట్టించుకోలేదని తెలిపాడు.