అలా మాట్లాడకూడదంటూ సావిత్రి నా తలపై ఒక్కటిచ్చింది: జమున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలా మాట్లాడకూడదంటూ సావిత్రి నా తలపై ఒక్కటిచ్చింది: జమున

  • 'మిస్సమ్మ' సినిమా షూటింగులో వున్నాం 
  • సావిత్రితో భోజనానికి కూర్చున్నాను 
  • మా ఇంటి నుంచి నాకు క్యారియర్ వచ్చింది  
అలనాటి నటీమణులలో సావిత్రి తరువాత స్థానంలో జమున కనిపిస్తారు. సావిత్రితో కలిసి ఆమె కొన్ని సినిమాల్లో నటించారు. 'మిస్సమ్మ' సినిమా షూటింగులో జరిగిన ఒక సరదా సంఘటనను గురించి జమున చెప్పుకొచ్చారు. " 'మిస్సమ్మ' సినిమా సమయానికే నేను .. సావిత్రి బాగా క్లోజ్. అక్కా చెల్లెళ్లుగా ఎక్కువ సినిమాలు చేశాం .. అలాగే పిలుచుకునే వాళ్లం"

"ఒక రోజున అంతా కలిసి భోజనానికి కూర్చున్నాం .. మా ఇంటి నుంచి పప్పు .. కూరలతో నాకు భోజనం వచ్చింది. పక్కనే అక్కయ్య వాళ్లు మాంసాహారం తింటున్నారు. ఫస్టు టైమ్ నేను మాంసం చూడటం. నా మటుకు నేను ఊరుకోకుండా ఏంటక్కయ్యా అది .. అని అడిగాను. 'తింటావా .. మాంసం' అంది. 'అబ్బే .. ఛీ .. పాడు' అన్నాను. పక్కనే కూర్చుంది కదా .. ఫట్ మంటూ నా తలపైన కొట్టింది. 'ఎప్పుడు నేర్చుకుంటావ్ నువ్వు బాగా మాట్లాడటం .. తప్పు అలా అనకూడదు .. అవతల తినే వాళ్లు బాధపడతారు. నీకు ఇష్టం లేకపోతే దూరంగా కూర్చో ..' అంది సావిత్రి" అంటూ జమున చెప్పుకొచ్చారు. 
hamuna
savithri

More Telugu News