చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం: సురభి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం: సురభి

  • పాటలు పాడటమంటే ఇష్టం 
  • సినిమాలు ఎక్కువగా చూసే దానిని
  • ఢిల్లీలో మోడలింగ్ చేశాను
  • అటు నుంచి సినిమాల్లోకి       
తెలుగు తెరపై అందం .. అభినయం కలగలిసిన కథానాయికల జాబితాలో సురభి పేరు కూడా కనిపిస్తుంది. సురభి ఖాతాలో 'బీరువా' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' .. 'జెంటిల్ మెన్' వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు వున్నాయి. యువ కథానాయకులతో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తోన్న సురభి, 'ఒక్క క్షణం' సినిమాతో ఈ నెల 28వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది.

 ఈ సందర్భంగా ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, "అల్లు శిరీష్ హీరోగా వి.ఐ. ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో నేను జ్యోత్స్న అనే పాత్రలో కనిపిస్తాను" అంది. 'నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటమన్నా .. ఫోటోగ్రఫీ .. పెయింటింగ్ .. ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా చాలా ఇష్టం. అలాగే స్కూల్ ఏజ్ నుంచే నాకు సినిమాలంటే ఇష్టం ఏర్పడింది. రాన్రాను సినిమాలు ఎక్కువగా చూసే దానిని. ఆ తరువాత ఢిల్లీలో మోడలింగ్ చేశాను .. అటు వైపు నుంచి సినిమాల్లోకి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చింది.           
surabhi

More Telugu News