Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ నిర్మాతకి నాతో నటించాలనేది పిచ్చి .. అందుకే ఆ సినిమా తీశారు!: జమున

  • డీఎల్ గారిని వెంటబెట్టుకుని సీతారామ్ వచ్చారు
  • సీతారామ్ ను డీఎల్ పరిచయం చేశారు 
  • భారీ సినిమా తీయనున్నట్టు చెప్పారు 
  • నా జోడీ సీతారామ్ అని తెలిసి చేయనన్నాను       
తాజాగా జమున .. 'అలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "నిర్మాత సీతారామ్ కి నాతో కలిసి నటించాలనే పిచ్చి ఉండేది. నేను చాలా అందంగా వుండే దానిని .. దాంతో సినిమాలోనైనా కాస్త చేయి పట్టుకోవచ్చనేమో .. 'బొబ్బిలి యుద్ధం' తీశారు. ఈ సినిమా తీయడానికి ముందు సీతారామ్ .. డీఎల్ నారాయణను వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చారు.

"ఆయనను నాకు డీఎల్ గారు పరిచయం చేశారు. చాలా పెద్ద సినిమా తీస్తున్నారని చెప్పి .. ఎన్టీఆర్ - భానుమతి ఒక జంట, మీరు ఈయన ఒక జంట అని అన్నారు. దాంతో 'అయ్య బాబోయ్ నేను చెయ్యను' అనేశాను. 'కాంబినేషన్ కరెక్ట్ గా లేకపోతే .. ఈ సినిమా డబ్బాలు వెనక్కి వచ్చేస్తాయి' అని చెప్పాను. అయినా వినిపించుకోకుండా ఆయన .. డీఎల్ గారు రోజూ వచ్చి బ్రతిమాలేవారు. 'చెయ్యమ్మా .. లేకపోతే ఆయన ఉరేసుకుని చనిపోయేలా వున్నాడు' అంటూ డీఎల్ గారు ఒప్పిస్తే చివరికి చేశాను" అంటూ చెప్పుకొచ్చారు.       
jamuna

More Telugu News