వెంకయ్యనాయుడికి చికాకు తెప్పిస్తున్న రాజ్యసభ సమావేశాలు
- సభా సమయాన్ని, ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు
- కీలక బిల్లులపై చర్చ జరగడం లేదు
- పరిస్థితులు దిగజారుతున్నాయి
ప్రజా ప్రతినిధుల నిరసన కార్యక్రమాలతో సభా సమయం వృథా అవుతోందని, ప్రజాధనం దుర్వినియోగమవుతోందని చెప్పారు. నేతలందరూ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. పరిస్థితులు నానాటికీ మరింతగా దిగజారుతున్నాయని అన్నారు. కీలకమైన బిల్లులపై చర్చించే పరిస్థితి కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ పై మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాజ్యసభ సమావేశాలకు అంతరాయం కలుగుతున్న సంగతి తెలిసిందే.