Sandhyarani: సంధ్యారాణిని రికమండ్ చేసి ఉద్యోగం ఇప్పించింది కార్తీకే: లక్కీ ట్రేడర్స్ యాజమాన్యం

  • సంధ్యను పరిచయం చేశాడు
  • ఉద్యోగం కావాలని అడిగాడు
  • లక్కీ ట్రేడర్స్ యజమాని జగన్ రెడ్డి
  • వేధిస్తున్నాడని సంధ్య ఫిర్యాదు చేసింది
  • ఈలోపే దారుణం జరిగిందన్న జగన్ రెడ్డి
తన ప్రేమను కాదన్నదన్న ఆగ్రహంతో దారుణానికి పాల్పడ్డ కార్తీక్, బాధితురాలు సంధ్యారాణి ఇద్దరూ స్నేహితులేనని వారు పనిచేసిన లక్కీ ట్రేడర్స్ యజమాని జగన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సంధ్యారాణిని తన వద్దకు తీసుకొచ్చి పరిచయం చేసి, పని కావాలని అడిగింది కార్తీకేనని, అతని విజ్ఞప్తిపైనే ఆమెకు ఉద్యోగం ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఆ తరువాత కొంత కాలానికి కార్తీక్ సరిగ్గా విధులకు రాకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించామని తెలిపారు.

ఆపై కార్తీక్ తనను వేధిస్తున్నాడని సంధ్యారాణి తనతో చెప్పిందని, ఈ విషయమై రెండు రోజుల క్రితం కార్తీక్ ను పిలిపించి తాను ప్రశ్నించానని జగన్ రెడ్డి తెలిపారు. తానే ఆమెకు ఫోన్ ను కొనిచ్చానని, తాను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదని, పెళ్లికి నిరాకరిస్తోందని కార్తీక్ చెప్పాడని, ఈలోగానే ఇంత పని చేస్తాడని ఊహించలేదని అన్నారు.
Sandhyarani
Kartik
Harrasment
Jagan Reddy

More Telugu News