ఉన్మాది ఘాతుకానికి బలైన సంధ్యారాణి కన్నుమూత
- నడిరోడ్డుపై పెట్రోలు పోసి నిప్పంటించిన కార్తీక్
- తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి
- హత్య కేసు నమోదు చేసిన పోలీసులు
నిన్న సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో లాలాపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కార్తీక్ ఈ ఘాతుకానికి పాల్పడగా, 70 శాతం కాలిన గాయాలతో బాధితురాలు, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో కార్తీక్ ఆ వెంటనే లొంగిపోగా, అతనిపై పెట్టిన హత్యాయత్నం కేసును, ఇప్పుడు హత్య కేసుగా మార్చనున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.