హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనం!
- లాలాగూడలో దారుణ సంఘటన
- తనను ప్రేమించడం లేదంటూ ఓ యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రేమోన్మాది
- డెబ్భై శాతానికి పైగా కాలిపోయిన యువతి శరీరం
ఈ సంఘటనలో 70 శాతానికి పైగా ఆమె శరీరం కాలిపోయింది. సంధ్యారాణి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోపక్క, నిందితుడు కార్తీక్ కోసం పోలీసులు గాలింపు చేబట్టారు. కాగా, బాధితురాలు సంధ్యారాణి స్థానిక శాంతినగర్ లో లక్కీ ట్రేడర్స్ లో పనిచేస్తోంది.