ఒక్క నిమిషంలో 122 కొబ్బ‌రి కాయ‌లు చేతితో పగుల‌గొట్టి రికార్డు... వీడియో చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక్క నిమిషంలో 122 కొబ్బ‌రి కాయ‌లు చేతితో పగుల‌గొట్టి రికార్డు... వీడియో చూడండి!

  • గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న కేర‌ళ వ్య‌క్తి
  • ఫిబ్ర‌వ‌రిలో రికార్డు వీడియోను ఇటీవ‌ల అప్‌లోడ్ చేసిన గిన్నిస్‌
  • గ‌త రికార్డు 118 కొబ్బ‌రి కాయ‌లు
కేర‌ళ‌కు చెందిన అబీష్ పి డామినిక్ ఒక్క నిమిషంలో 122 కొబ్బ‌రి కాయ‌లు చేతితో ప‌గులగొట్టి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో కొట్టాయం ప్రాంతంలో డామినిక్ ఈ రికార్డు నెల‌కొల్పారు. కాగా.. ఈ రికార్డుకి సంబంధించిన వీడియోను గిన్నిస్‌బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్ ఇటీవ‌ల త‌మ అధికారిక యూట్యూబ్ ఛాన‌ల్‌లో అప్‌లోడ్ చేసింది. గ‌త రికార్డు 118 కొబ్బ‌రికాయ‌ల‌ను డామినిక్ బ‌ద్ద‌లు కొట్ట‌డం ఈ వీడియోలో చూడొచ్చు.

మొత్తం 140 కొబ్బ‌రికాయ‌ల్లో 122 కాయ‌ల‌ను ఒక్క నిమిషంలో డామినిక్ ప‌గుల‌గొట్టాడు. అంటే తన కుడిచేతి పిడికిలితో ఒక్క సెక‌నులో డామినిక్ రెండు కొబ్బ‌రి కాయ‌లు ప‌గుల‌గొట్టాడ‌న్నమాట‌.

guinness
book
world
record
coconuts
kerala

More Telugu News