ఆనందంతో ఎ.రాజాను ఆలింగనం చేసుకున్న కనిమొళి
- 2జీ స్కాం కేసును కొట్టేసిన పటియాలా హౌస్ కోర్టు
- కోర్టు తీర్పు వెలువడగానే తీవ్ర ఉద్వేగానికి గురైన కనిమొళి
- మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు
ఈ నేపథ్యంలో, సరైన ఆధారాలు లేవనే కారణంతో ఈ కేసును నేడు పటియాలా హౌస్ కోర్టు కొట్టేసింది. దీంతో కనిమొళి, రాజాలు ఊపిరి పీల్చుకున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే కనిమొళి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న ఎ.రాజాను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కష్ట కాలంలో ఉన్నప్పుడు తమకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.