రేపు విడుదల కదా... ఎప్పటిలానే నెర్వస్ గా వుంది!: నేచుర‌ల్ స్టార్ నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు విడుదల కదా... ఎప్పటిలానే నెర్వస్ గా వుంది!: నేచుర‌ల్ స్టార్ నాని

  • నెర్వ‌స్‌గా ఉంది
  • నా ప్ర‌తి సినిమా విడుద‌ల‌కు ముందు నాకు ఇలాగే ఉంటుంది
  • హ‌లో సినిమా విజ‌య‌వంతం అవుతుంది
  • అఖిల్‌ని ప్రేక్ష‌కులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా క‌న‌ప‌డ‌తాడు
నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఎమ్‌సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విష‌యాన్ని గుర్తు చేస్తూ నాని ఈ రోజు ట్వీట్ చేశాడు. త‌న‌కు ఎంతో ఉత్సాహంగా ఉంద‌ని అన్నాడు. అలాగే, త‌న‌ ప్ర‌తి సినిమా విడుద‌ల‌య్యే ముందు త‌న‌కు ఎలా నెర్వ‌స్‌గా ఉంటుందో ఇప్పుడూ అలాగే ఉంద‌ని అన్నాడు. ప్రేక్ష‌కులు ఈ సినిమాని ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు.

అలాగే, అక్కినేని అఖిల్ న‌టించిన 'హ‌లో' సినిమా ఎల్లుండి విడుద‌ల కానున్న నేప‌థ్యంలో స‌ద‌రు హీరోకి నాని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. హ‌లో సినిమా విజ‌య‌వంతం అవుతుంద‌ని, అఖిల్‌ని ప్రేక్ష‌కులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా క‌న‌ప‌డ‌తాడ‌ని ఆశిస్తున్నాన‌ని నాని ట్వీట్ చేశాడు. 
MCAonDec21st
HelloOnDec22nd
nani

More Telugu News