కిలో టమోటా రూపాయి మాత్రమే.. దారుణంగా పడిపోయిన ధర!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిలో టమోటా రూపాయి మాత్రమే.. దారుణంగా పడిపోయిన ధర!

  • రైతులను దోచుకుంటున్న దళారీలు
  • కంటతడి పెడుతున్న రైతన్నలు
  • ప్రభుత్వం న్యాయం చేయాలంటూ వేడుకోలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టమోటా ధర దారుణంగా పతనమైంది. మదనపల్లి, బోయిన్ పల్లి, కర్నూలు, పత్తికొండ టమోటా మార్కెట్లలో ధర అమాంతం పడిపోయింది. హోల్ సేట్ మార్కెట్లో కేజీ టమోటా రూ. 1 నుంచి రూ. 4 వరకు పలుకుతోంది. రైతుల కష్టాన్ని దళారీలు దోచుకుంటున్నారు. రవాణా ఛార్జీలు కూడా రావడం లేదంటూ రైతన్నలు కంటతడి పెడుతున్నారు. దళారీల దోపిడీని అరికట్టాలని, తమకు న్యాయం చేయాలని టమోటా రైతులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. మరోవైపు, రీటైల్ మార్కెట్ లో కిలో టమోటా రూ. 10 పలుకుతోంది.
tamota
tamota rate

More Telugu News