మీడియాపై నిప్పులు చెరిగిన నటుడు విజయ్ భార్య వనితారెడ్డి.. నేడు పోలీసులకు లొంగుబాటు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీడియాపై నిప్పులు చెరిగిన నటుడు విజయ్ భార్య వనితారెడ్డి.. నేడు పోలీసులకు లొంగుబాటు!

  • తప్పుడు కథనాలు రాశారు
  • మహిళకు మీడియా ఇచ్చే గౌరవం ఇదేనా?
  • విజయ్ ఎంతో మంది అమ్మాయిలను బెడ్ రూమ్ కి తీసుకొచ్చేవాడు
తాను ఎక్కడికీ పారిపోలేదని ఆత్మహత్యకు పాల్పడ్డ టాలీవుడ్ నటుడు విజయ్ భార్య వనితా రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు పోలీసులకు లొంగిపోతున్నట్టు తెలిపారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మీడియాపై నిప్పులు చెరిగారు. మహిళ అని కూడా చూడకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు.

కారు ఎవరిదో కూడా తెలుసుకోకుండా కారుకూతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు కోసం గొడవ జరగలేదని, ఆ కారు తనదే అని చెప్పారు. తాను మౌనంగా ఉండటంతో, ఏదో ఒకటి రాస్తూ తనకు మానసిక క్షోభను కలిగించారని తెలిపారు. కారు కోసం జూబ్లీహిల్స్ పీఎస్ లో కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. కారు కోసం హ్యుందాయ్ షోరూమ్ వాళ్లని తీసుకెళ్లానని తెలిపారు. మీడియా వైఖరి సరిగా లేదని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు.

విజయ్ తల్లిదండ్రుల వల్లే తమ మధ్య విభేదాలు తలెత్తాయని వనిత తెలిపారు. విజయ్ కి సినిమాలు లేకపోయినప్పటికీ, కలిసి బతుకుదామని తాను భరోసా ఇచ్చానని చెప్పారు. విజయ్ తనపై చెడు ప్రచారం చేశాడని వాపోయారు. తాను ఎక్కడకు వెళ్లినా, వెంటపడి వేధించేవాడని చెప్పారు. ఈ క్రమంలోనే విడాకుల కోసం కేసు వేశానని తెలిపారు. విజయ్ ఎంతో మంది అమ్మాయిలను బెడ్ రూమ్ కి తీసుకు వచ్చేవాడని చెప్పారు. డబ్బు కోసం వేధించేవాడని అన్నారు. తనను ఎన్నోసార్లు కొట్టాడని తెలిపారు. 
actor vijay
vanitha reddy

More Telugu News