నా హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే..!: పవన్ కల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే..!: పవన్ కల్యాణ్

  • అభిమానించే ప్రతి ఒక్కరినీ నా గుండెల్లో పెట్టుకోవాలని ఉంటుంది
  • నా సినిమా చూడమని నేనెప్పుడూ చెప్పను..బలవంతపెట్టను
  • ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో పవన్ కల్యాణ్
‘నా హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే.. అభిమానించే ప్రతి ఒక్కరినీ నా గుండెల్లో పెట్టుకోవాలని ఉంటుంది’ అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ జరిగిన ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తన సినిమా చూడమని తానెప్పుడూ చెప్పనని.. బలవంతపెట్టని.. నచ్చితేనే చూడాలని అన్నారు. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ తమ వంతు కృషి చేసిందని చెప్పారు.

‘‘ఖుషీ’ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసి వెళ్లిపోదామనుకున్నాను. అయితే, అభిమానుల అభిమానం నాతో మరిన్ని సినిమాల్లో నటించేలా చేసింది. గెలుపు, ఓటములు నాకేమీ పట్టవు. కానీ, నా చుట్టుపక్కల వాళ్లు, సన్నిహితులు దీని గురించి బాధపడేవారు. ఒకదశలో సిినిమాలకు దూరంగా వెళిపోదామనుకున్నా. అయితే నేను చేయూత నిచ్చిన వాళ్లు, నాకు అండగా నిలవలేదు.

కానీ.. అభిమానులు నాకు అండగా నిలిచారు. అభిమానుల కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది. నాకు భయం లేదు కానీ, నిరాశా నిస్పృహలు ఉన్నాయి’ అన్నారు పవన్. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తూ.. ‘మా ఇద్దరి మధ్య ఉన్న భావజాలం మమ్మల్ని కలిపింది. నా వెన్నుతట్టి, నా గుండెల నిండా ధైర్యం నింపిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్’ అని భావోద్వేగం చెందారు.
పవన్ కల్యాణ్
‘అజ్ఞాతవాసి’

More Telugu News