Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ పై తనికెళ్ళ భరణి కవిత.. మార్మోగిపోయిన చప్పట్లు!

  • ఈ సినిమా ఓ చరిత్ర సృష్టిస్తుంది
  • ‘అజ్ఞాతవాసి’లో నాకు వేషం లభించడం నా అదృష్టం 
  • ఆడియో వేడుకలో భరణి
‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో పాల్గొన్న ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ, ‘నేను మూడే ముక్కలు మాట్లాడతాను. ఒకటి.. పవన్ కల్యాణ్. రెండు... పవన్ కల్యాణ్. మూడు... పవన్ కల్యాణ్. ఇంకేం మాట్లాడతాను నేను! ఇప్పుడు నిజంగా మాట్లాడుతున్నాను.. త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్ చిత్రంలో నేను వేషం వేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా ఓ చరిత్ర సృష్టిస్తుంది’ అన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి భరణి ఓ చిన్న కవిత చదివి వినిపించారు.
 
‘అతగాడు మితభాషి
నిత్య సత్యాన్వేషి
అర్జునుని వంటి ఒక అజ్ఞాతవాసి’ అని భరణి తన కవిత చదివి వినిపించగానే అభిమానుల చప్పట్లు మారుమోగిపోయాయి.
పవన్ కల్యాణ్
‘అజ్ఞాతవాసి’

More Telugu News