రోహిత్.. ఆ హ్యాండ్ బుక్ కూడా పంపించు ప్లీజ్: విరాట్ కోహ్లీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోహిత్.. ఆ హ్యాండ్ బుక్ కూడా పంపించు ప్లీజ్: విరాట్ కోహ్లీ

  • హానీమూన్ లో బిజీగా కోహ్లీ, అనుష్క జంట
  • వారం తర్వాత రోహిత్ ట్వీట్ కు రిప్లై
  • డబుల్ సెంచరీ హ్యాండ్ బుక్ ఇవ్వాలని అడిగిన కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు హానీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరి పెళ్లైన తర్వాత రోహిత్ శర్మ ఓ ట్వీట్ చేశాడు. 'కోహ్లీ... భర్త ఎలా ఉండాలో చెప్పే ఓ హ్యండ్ బుక్ ఇస్తా' అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ ట్వీట్ చేసి వారం రోజులు గడిచిపోయింది. హానీమూన్ లో ఉన్న కోహ్లీకి ఇప్పుడు తీరిక దొరికింది. రోహిత్ ట్వీట్ కు ఈరోజు సమాధానం ఇచ్చాడు. 'థ్యాంక్స్ రోహిత్... డబుల్ హండ్రెడ్ హ్యాండ్ బుక్ కూడా పంపించు ప్లీజ్' అంటూ ట్వీట్ చేశాడు. టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీకి... వన్డేల్లో డబుల్ హండ్రెడ్ మాత్రం ఇంకా సాధ్యం కాలేదు. వన్డేల్లో కోహ్లీ హయ్యెస్ట్ స్కోర్ 183 మాత్రమే.
Rohit Sharma
Virat Kohli
Anushka Sharma
team india

More Telugu News