హైదరాబాద్‌లో అడుగుపెట్టిన రాష్ట్రపతి.. స్వాగతం పలికిన నరసింహన్, కేసీఆర్!
- ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో కోవింద్
- ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి
- ఎల్బీ స్టేడియంలో ప్రసంగించనున్న కోవింద్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌కు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో రాష్ట్రపతి నగరంలోని లాల్ బహదూర్ స్టేడియానికి చేరుకోనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.



