నాన్నలో మునుపటి సంతోషాన్ని ఇప్పుడు చూస్తున్నాను!: చిరంజీవి తనయ సుస్మిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాన్నలో మునుపటి సంతోషాన్ని ఇప్పుడు చూస్తున్నాను!: చిరంజీవి తనయ సుస్మిత

  • కాస్ట్యూమ్ డిజైనర్ గా సుస్మిత బిజీ
  • చేతిలో 'రంగస్థలం' .. 'సైరా' సినిమాలు 
  • షూటింగ్ లేకపోతే నాన్న హ్యాపీగా వుండరు 
  • ఆయన ఇప్పుడు ఎంతో ఆనందంగా వున్నారు    
చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకి మొదటి నుంచి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. అందువలన ఆ మార్గంలో ముందుకు వెళ్లడానికే ఆమె ఆసక్తిని చూపుతూ వచ్చారు. చిరంజీవి 150 వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ఆమెకి మంచి గుర్తింపు లభించింది. ఆ ఉత్సాహంతో ప్రస్తుతం ఆమె 'రంగస్థలం'.. 'సైరా' సినిమాలకు పనిచేస్తున్నారు.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "సినిమాలకి బ్రేక్ ఇచ్చిన తరువాత కొంతకాలం పాటు ఇంట్లో నాన్న ఖాళీగా వుండవలసి వచ్చింది. ఆయన వయసు 60 దాటిపోయింది కదా .. ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు అని అంతా అనుకునే వాళ్లు. కానీ షూటింగులు లేకుండా .. అలా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నాన్నకు ఎంత మాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆ సమయంలో ఆయన అంతకు ముందులా సంతోషంగా కూడా ఉండేవారు కాదు. మళ్లీ నటించడం మొదలుపెట్టాక, మునుపటి సంతోషాన్ని ఇప్పుడు ఆయనలో చూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.   
chiranjeevi
susmita

More Telugu News