గుజరాత్ ఫలితాలు... ఆ 16 సీట్లలో ఇంకాస్త కృషి చేసి వుంటే జాతకాలు తారుమారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుజరాత్ ఫలితాలు... ఆ 16 సీట్లలో ఇంకాస్త కృషి చేసి వుంటే జాతకాలు తారుమారు!

  • దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన గుజరాత్ ఎన్నికలు
  • విజయానికి దగ్గర కాలేకపోయిన కాంగ్రెస్
  • 16 చోట్ల మెజారిటీ 2000కు లోపే
  • గోద్రాలో 258 ఓట్ల మెజారిటీతో బీజేపీ విజయం
దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకెత్తించిన గుజరాత్ ఎన్నికల్లో ఫలితం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వెలువడింది. రాష్ట్రంలో 22 సంవత్సరాల బీజేపీ పాలనకు చరమగీతం పాడాలన్న ఏకైక లక్ష్యంతో, కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నించినా, విజయానికి మాత్రం దగ్గర కాలేకపోయింది. చాలా నియోజకవర్గాల్లో పోటీ హోరాహోరీగా సాగినట్టు గెలుపొందిన అభ్యర్థులు సాధించిన బొటాబొటీ మెజారిటీ తెలియజేస్తోంది. ముఖ్యంగా 16 చోట్ల గెలుపొందిన, ఓడిపోయిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 200 నుంచి 2 వేల ఓట్లలోపే ఉండటం గమనార్హం.

ఎన్సీపీ, బీఎస్పీ పార్టీలతో పాటు, ఇండిపెండెంట్లుగా నిలిచిన అభ్యర్థులు, ప్రధాన పార్టీ అభ్యర్థుల ఓట్లకు గండి కొట్టారు. గోద్రాలో బీజేపీ అభ్యర్థి కేవలం 258 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించాడు. ఇక్కడ నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)కు 3,050 ఓట్లు, ఇండిపెండెంట్ కు 18 వేల ఓట్లు వచ్చాయి. విజాపూర్, మన్సా, దేంగ్స్, దేవధర్ తదితర ఎనిమిది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు 2 వేల కన్నా తక్కువ ఓట్ల మార్జిన్ తో ఒడ్డున పడ్డారు. ఇక ఈ నియోజకవర్గాల్లో ఇంకాస్త కృషి చేసి ఉంటే, ఫలితం తమకు అనుకూలంగా వచ్చి ఉండేదని ఓడిపోయిన వారు చర్చించుకుంటున్నారు.
Gujarath
Congress
BJP
Elections

More Telugu News