అనుష్కతో కలిసి నటించా .. ఆమె చాలా మంచిది: 'వేదం' నాగయ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్కతో కలిసి నటించా .. ఆమె చాలా మంచిది: 'వేదం' నాగయ్య

  • అనుష్క ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది 
  • ఆమె అచ్చం దేవతలాగే అనిపించేది 
  • ఆమె ఇంటికి కూడా వెళ్లేవాడిని
'వేదం' సినిమా చూసిన వాళ్లకి .. పల్లెటూరి వృద్ధుడిగా తెరపై నాగయ్య చేసిన నటన బాగా నచ్చేసింది. అదే మొదటి సినిమా కావడంతో 'వేదం' నాగయ్యగా ఆయనకి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత సహజత్వానికి దగ్గరగా వుండే చాలా పాత్రల్లో ఆయన నటించాడు. అలాంటి నాగయ్యకి .. "అనుష్కతో ఎప్పుడైనా మాట్లాడారా?" అనే ప్రశ్న ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ " అనుష్కతో కలిసి 6 నెలల పాటు షూటింగులో పాల్గొన్నాను. నన్ను చూడగానే "తాతగారూ బాగున్నారా .. ఇలా రండి .. ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందాం" అనేది. నాగార్జునతో ఆమె సినిమా (ఓం నమో వేంకటేశాయ) చేసేటప్పుడు, ఒక వైపున కొప్పు పెట్టి ఆమె నడుస్తూ వుంటే .. గంధర్వ లోకం నుంచి వచ్చిన దేవతలాగే అనిపించేది. నిజంగా ఆమె చాలా మంచి మనిషి .. నాతో వున్న సాన్నిహిత్యం కారణంగా ఇంటికి రమ్మని అంటుంది. నేను వెళ్లినప్పుడేమో ఆమె వుండదు .. ఆమె వున్నప్పుడేమో ఆ విషయం నాకు తెలియక వెళ్లలేను" అంటూ చెప్పుకొచ్చాడు.     
vedam nagayya

More Telugu News