త్వరలో 'పార్ట్నర్' సినిమాకు సీక్వెల్?
- నిర్మించేందుకు సిద్ధమైన సొహైల్ ఖాన్
- ఇప్పటికే టైటిల్స్ రిజిస్టర్ చేయించిన నిర్మాత
- మరోసారి సందడి చేయనున్న గోవిందా, సల్మాన్
ఈ సీక్వెల్ చిత్రానికి 'క్యారీ ఆన్ పార్ట్నర్', 'పార్ట్నర్ 2' అనే రెండు టైటిళ్లను సొహైల్ రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. అయితే గతంలో కూడా పార్ట్నర్కి సీక్వెల్ వస్తుందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సల్మాన్‌కి, గోవిందాకి మధ్య చిన్న గొడవలు రావడంతో సీక్వెల్ నిర్మాణం ఆగిపోయినట్లు కూడా పుకార్లు వచ్చాయి. అయితే వారిద్దరూ కలిసి సల్మాన్ 'వాంటెడ్' సినిమాలో కనిపించిన తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాలేదని అర్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు సొహైల్ టైటిల్స్ రిజిస్టర్ చేయించడంతో అభిమానులకు పండగే!