అంబానీ స్కూల్ వార్షికోత్స‌వంలో డ్యాన్స్ చేసిన ఆరాధ్య బ‌చ్చ‌న్... ఆక‌ట్టుకుంటున్న వీడియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంబానీ స్కూల్ వార్షికోత్స‌వంలో డ్యాన్స్ చేసిన ఆరాధ్య బ‌చ్చ‌న్... ఆక‌ట్టుకుంటున్న వీడియో

  • ఐశ్వ‌ర్యను గుర్తుచేస్తోందంటున్న నెటిజ‌న్లు
  • ఇదే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న షారుక్, ఆమిర్‌ల కుమారులు
  • చివ‌ర‌లో స్టెప్పులేసిన ఐష్‌
ధీరూభాయి అంబానీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ వార్షికోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌, షారుక్‌, గౌరీఖాన్‌లు హాజ‌ర‌య్యారు. వేడుక‌లో భాగంగా ఆరాధ్య బ‌చ్చ‌న్‌, అబ్‌రామ్, ఆమిర్‌ఖాన్ కుమారుడు ఆజాద్‌లు వేదిక మీద డ్యాన్సులు వేశారు. ఈ వేడుక‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీటిలో ఆరాధ్య బ‌చ్చ‌న్ డ్యాన్స్ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఆరాధ్య వేసిన కొన్ని స్టెప్పులు త‌న త‌ల్లి ఐశ్వ‌ర్య‌ను గుర్తుచేస్తున్నాయ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ఆరాధ్య వీడియోలోనే ఆమిర్ కుమారుడు ఆజాద్ కూడా ఉన్నాడు.

అలాగే షారుక్ కుమారుడు అబ్‌రామ్ త‌న తండ్రి సినిమా 'స్వ‌దేశ్‌' సినిమాలోని పాట‌కు డ్యాన్స్ చేసిన వీడియో కూడా చాలా బాగుంది. షారుక్ కూతురు తండ్రితో క‌లిసి త‌మ్ముడి డ్యాన్స్‌ను ఎంజాయ్ చేయ‌డం కూడా ఈ వీడియోలో ఉంది. ఇంకా పార్టీ చివ‌ర్లో ఐష్ కూడా పిల్ల‌ల‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియో కూడా సోష‌ల్ మీడియాలో వుంది.
ambani
annual day
video
aaradhya bachchan
abram

More Telugu News