Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జియో ఖాతాదారులకు శుభవార్త.. ఇక కంప్యూటర్‌లోనూ జియో టీవీ!

  • జియో టీవీ, సినిమా యాప్‌లకు వెబ్ వెర్షన్లు
  • ఇకపై కంప్యూటర్ తెరపైనా సినిమాలు
  • ఖాతాదారుల అభ్యర్థన మేరకు ప్రవేశపెట్టిన జియో
రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. ఫోన్లో మాత్రమే అందుబాటులో ఉన్న జియో టీవీ, జియో సినిమా యాప్స్‌కు ఇకపై వెబ్‌సైట్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. వినియోగదారుల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ఈ  సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్లు, జియో ఫోన్లలో మాత్రమే జియో టీవీ, జియో సినిమాలను ఖాతాదారులు ఉపయోగించుకునే వీలుండేది. జియో తాజా నిర్ణయంతో ఇకపై ఎంచక్కా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో కూడా వీటిని వినియోగించుకోవచ్చు.

జియో టీవీలో తెలుగు, హిందీ సహా 550 లైవ్ చానల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి  యాప్స్ రూపంగా ఉండడంతో వెబ్ వెర్షన్ తీసుకొస్తే బాగుంటుందని వినియోగదారుల నుంచి అభ్యర్థనలు వెళ్లాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న జియో వినియోగదారులకు మరింతగా చేరువ కావాలంటే వెబ్ వెర్షన్లు కూడా ఉండాలని భావించి వెబ్ వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
JIo
Reliance
JIo TV

More Telugu News