వ్యభిచారం కేసులో పట్టుబడిన హీరోయిన్లు రిచా సక్సేనా, శుభ్రా చటర్జీ పంజాగుట్ట పీఎస్ కు తరలింపు!
- స్టార్ హోటల్స్ పై పోలీసుల దాడి
- దొరికిపోయిన ఇద్దరు హీరోయిన్స్
- పంజాగుట్ట పోలీసులకు అప్పగించామన్న టాస్క్ ఫోర్స్
శుభ్రాను హోటల్ కు తెచ్చిన వెంకట్రావ్ ను, రిచాను బంజారాకు తీసుకెళ్లిన బ్రోకర్ ను కూడా అరెస్ట్ చేశామని, వీరిని రేపు కోర్టులో ప్రవేశపెడతామని పోలీసు అధికారులు తెలిపారు. వీరిద్దరూ ఒక రాత్రి గడిపేందుకు లక్ష రూపాయలకు బేరం కుదుర్చుకుని వచ్చారని, ఇద్దరినీ విటులకు పరిచయం చేసిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ మాధ్యమంగా ప్రకటనలు ఇచ్చి, వీరిని హోటల్స్ కు తీసుకు వచ్చారని, కేసును విచారిస్తున్నామని అన్నారు.