తాజ్ బంజారా, రూమ్ నంబర్ 402... హీరోయిన్ రిచా సక్సేనా గుట్టు రట్టయిందిలా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తాజ్ బంజారా, రూమ్ నంబర్ 402... హీరోయిన్ రిచా సక్సేనా గుట్టు రట్టయిందిలా!

  • తాజ్ బంజారా హోటల్ లో అరెస్ట్
  • నిర్ధారిత సమాచారాన్ని అందుకుని పోలీసుల దాడులు
  • తాజ్ డెక్కన్ లో బెంగాలీ నటి కూడా
హైదరాబాద్ లో పేరొందిన స్టార్ హోటల్స్ లో వ్యభిచారం జరుగుతోందని పసిగట్టిన పోలీసులు, ఏక కాలంలో తాజ్ బంజారా, తాజ్ డక్కన్ హోటల్స్ పై దాడులు చేయగా, టాలీవుడ్ నటి రిచా సక్సేనా దొరికిపోయింది. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, సినీతారలు తన వద్ద ఉన్నారని, వారిని ఏ హోటల్ కు కావాలంటే ఆ హోటల్ కు పంపిస్తానని చెబుతూ, మోనిష్‌ కడాకియా అనే వ్యక్తి గత కొంత కాలంగా ఆన్ లైన్ లో ప్రకటనలు ఇస్తున్నాడు.

వీటిని గమనించిన పోలీసులు, సదరు ఐపీ అడ్రస్ పై, మోనిష్‌ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో 'జూన్ 1:43' నటి రిచా, తాజ్ బంజారాకు వస్తున్నట్టు తెలుసుకున్నారు. బంజారాలోని రూమ్ నంబర్ 402ను ఓ విటుడి కోసం కడాకియా బుక్ చేశాడని, అక్కడికి రిచాను పంపాడని నిర్ధారిత సమాచారాన్ని అందుకున్నారు. ఇదే సమయంలో ఓ బెంగాలీ నటిని తాజ్ డెక్కన్ లో ఓ సినీ ప్రముఖుడు బుక్ చేసుకున్నాడన్న సమాచారం కూడా అందింది.

దీంతో బంజారాహిల్స్ ప్రాంతంలో పేరున్న ఈ రెండు హోటల్స్ పైనా ఏకకాలంలో దాడి చేశారు. పోలీసులు తమ వాహనాలు వదిలి, సూటు, బూటేసుకుని కస్టమర్ల మాదిరిగా హోటల్ లోనికి ప్రవేశించిన వీరు, వ్యభిచారానికి సహకరించిన తాజ్ బంజారా హోటల్ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు.

Richa Saksena
Taj Deccan
Taj Banjara
Prostitution

More Telugu News