వ్యభిచారం చేస్తూ పట్టుబడిన టాలీవుడ్ నటి రిచా సక్సేనా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన టాలీవుడ్ నటి రిచా సక్సేనా

  • 'జూన్ 1:43'లో నటించిన రిచా సక్సేనా
  • హోటల్ లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి
  • దాడిలో కాస్ట్యూమ్ డిజైనర్ మోనిష్‌ కూడా
  • రూ. 50 వేలు స్వాధీనం
  • వెనుక బడాబాబులు!
వర్థమాన టాలీవుడ్ నటి, 'జూన్ 1:43' హీరోయిన్ రిచా సక్సేనా, హైదరాబాద్ లో జరిగిన పోలీసుల రైడింగ్ లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. ఓ హోటల్ లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం పోలీసులకు అందడంతో, వారు దాడి చేశారు. ఈ దాడుల్లో రిచా సక్సేనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఆమెతో పాటు, ఆమెను హోటల్ కు తీసుకు వచ్చిన కాస్ట్యూమ్ డిజైనర్ మోనిష్‌ కడాకియాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి తనవంతు సహకారాన్ని అందించిన హోటల్ మేనేజర్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు.

నిందితుల నుంచి రూ. 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీరి వెనుక బడాబాబులు ఉన్నారని సమాచారం. కాగా, ఆదిత్య‌ హీరోగా, ఆదిత్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన 'జూన్ 1:43' చిత్రం, తనకు ఏ మాత్రం బ్రేక్ ఇవ్వకపోగా, అవకాశాలు దక్కని స్థితిలో రిచా ఉందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ఫ్రాడ్ కథాంశంగా తెరకెక్కిన చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
Richa saksena
june 1:43
Tollywood
prostitution

More Telugu News