కాంగ్రెస్ అధ్య‌క్షుడు కాగానే అమ్మ నుదిటిపై ముద్దుపెట్టిన రాహుల్ గాంధీ.. ఫొటో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ అధ్య‌క్షుడు కాగానే అమ్మ నుదిటిపై ముద్దుపెట్టిన రాహుల్ గాంధీ.. ఫొటో!

  • వేదిక‌పై అరుదైన దృశ్యం
  • ఫొటో వైర‌ల్‌
  • కాంగ్రెస్‌కి అధ్య‌క్షుడైనా ఓ త‌ల్లికి కుమారుడే
  • నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ త‌న తల్లి నుంచి బాధ్యతలు స్వీకరించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వేదిక‌పై రాహుల్ గాంధీ త‌న త‌ల్లి సోనియా గాంధీ నుదిటిపై ముద్దు పెట్టి త‌న‌యుడి ప్రేమ‌ను చాటాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. థ్యాంక్యు సోనియా గాంధీ.. ల‌వ్‌.. రెస్పెక్ట్ అనే ట్యాగ్‌తో ఈ ఫొటోను పోస్ట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడ‌యిన‌ప్ప‌టికీ ఓ త‌ల్లికి కుమారుడేన‌ని నెటిజ‌న్లు కితాబిస్తున్నారు. కాగా, రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ పున‌ర్‌వైభ‌వాన్ని సంత‌రించుకుంటుంద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. సోనియా గాంధీ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీని న‌డిపించిన తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.  
rahul gandhi
Sonia gandhi
Congress

More Telugu News