Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యువ‌సేన నిర‌స‌న‌ల కార‌ణంగా సన్నీ లియోన్ ఈవెంట్ ర‌ద్దు

  • భద్రత కార‌ణాల దృష్ట్యా ర‌ద్దు చేయాల‌ని ఆదేశించిన బెంగ‌ళూరు పోలీసులు
  • క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిర‌స‌నలు
  • క‌న్న‌డ సంస్కృతిని స‌న్నీ నాశ‌నం చేస్తోంద‌న్న నిర‌స‌న‌కారులు
న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా బెంగళూరులోని వైట్ ఆర్చిడ్ హోటల్‌లో బాలీవుడ్ తార స‌న్నీ లియోన్ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల్సి ఉంది. కానీ త‌మ రాష్ట్ర సంస్కృతికి స‌న్నీ లియోన్ భంగం క‌లిగిస్తోందని క‌ర్ణాట‌క వ్యాప్తంగా చెల‌రేగిన నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఆ ఈవెంట్‌ను ర‌ద్దు చేశారు. ర‌క్ష‌ణ కార‌ణాల దృష్ట్యా ఈ ఈవెంట్‌ను ర‌ద్దు చేయాల‌ని బెంగ‌ళూరు పోలీసులు నిర్వాహ‌కుల‌ను ఆదేశించారు.

అయితే ఈ విష‌యం గురించి త‌మ‌కు అధికారికంగా ఎలాంటి రాత‌పూర్వ‌క ఆదేశం రాలేదని, కేవ‌లం పోలీసులు ఈవెంట్‌ను ఆపాల‌ని మాత్ర‌మే చెప్పార‌ని, ఈ విష‌యం గురించి హోం శాఖ మంత్రితో చ‌ర్చిస్తాన‌ని ఈవెంట్ నిర్వాహ‌కుడు హ‌రీష్ తెలిపారు. త‌మ ఆందోళ‌న‌లు ప‌ట్టించుకోకుండా స‌న్నీ బెంగ‌ళూరు వ‌స్తే ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్న‌ట్లు క‌ర్ణాట‌క యువ‌సేన హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.
Karnataka
Sunny Leone
event
new year

More Telugu News