2017లో ఓవర్ పెయిడ్ నటుల జాబితాలో మార్క్వాల్ బర్గ్ టాప్
- వెల్లడించిన ఫోర్బ్స్ మేగజైన్
- రెండో స్థానంలో క్రిస్టియన్ బేల్
- పెట్టిన డబ్బుకు అనుకున్న వసూళ్లు సాధించని హీరోలు
గతేడాది 'ట్రాన్స్ఫార్మర్స్: ద లాస్ట్ నైట్', 'డాడీస్ హోమ్' చిత్రాల్లో నటించిన మార్క్, తన మీద ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క డాలర్‌కి కేవలం 4.40 డాలర్లు మాత్రమే లాభంగా రాబట్టినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. అలాగే రెండోస్థానంలో క్రిస్టియన్ బేల్ నిలిచాడు. ఈయన మీద ఖర్చు పెట్టిన ప్రతి డాలర్‌కి బేల్ 6.70 డాలర్ల లాభాన్ని రాబట్టగలిగారు. ఇక తర్వాతి స్థానాల్లో చేనింగ్ టేటమ్, డెంజెల్ వాషింగ్టన్, బ్రాడ్ పిట్లు నిలిచారు.