Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సచిన్, బ్రెట్ లీల మ‌ధ్య గో కార్ట్ ర్యాలీ పోటీ... వీడియో చూడండి!

  • వీడియో షేర్ చేసిన ఆసీస్ మాజీ ఆట‌గాడు
  • పోటీలో గెలిచిన స‌చిన్
  • గ‌తంలో కూడా గో కార్టింగ్ చేసిన ఇరు క్రికెట‌ర్లు
కేవ‌లం మైదానంలోనే కాదు... మైదానం బ‌య‌ట కూడా స‌చిన్ టెండూల్క‌ర్‌, బ్రెట్ లీలు ఛాలెంజ్‌లు పెట్టుకుంటుంటారు. ఇటీవ‌ల ముంబైలో వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన గో కార్ట్ ర్యాలీ ఛాలెంజ్ వీడియోను బ్రెట్ లీ షేర్ చేశాడు. వీరిద్ద‌రూ కార్ట్ ట్రాక్‌లో పోటీప‌డ‌టం ఈ వీడియోలో చూడొచ్చు. బ్రెట్ లీ యూట్యూబ్ ఛాన‌ల్ 'బ్రెట్ లీ టీవీ'లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ పోటీలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ గెలిచారు.

గ‌తంలో 2006లోనూ వీరిద్ద‌రూ గో కార్టింగ్ పోటీ పెట్టుకున్నట్లు బ్రెట్ లీ చెప్పాడు. అప్పుడు పోటీ పెట్టుకుందామ‌ని స‌చిన్ అడిగార‌ని, ఈసారి పోటీ పెట్టుకుందామ‌ని తాను అడిగాన‌ని బ్రెట్ లీ చెప్పాడు.

brett lee
sachin
go kart rally
video

More Telugu News