'హలో' శాటిలైట్ రైట్స్ షాకిస్తున్నాయ్
- అఖిల్ రెండవ సినిమాగా 'హలో'
- శాటిలైట్ రైట్స్ కి గట్టిపోటీ
- 5 కోట్ల 90 లక్షలకు దక్కించుకున్న జీ తెలుగు
- ఈ నెల 22వ తేదీన భారీస్థాయిలో విడుదల
ఇందుకోసం వాళ్లు 5 కోట్ల 90 లక్షలను చెల్లించినట్టు సమాచారం. మొదటి సినిమా ప్లాప్ అయినా .. రెండవ సినిమాకి ఈ స్థాయి రేటు పలకడం విశేషం. గతంలో 'అఖిల్' సినిమా శాటిలైట్స్ రైట్స్ ను సొంతం చేసుకున్నది కూడా ఈ ఛానల్ వారే. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 29 కోట్ల వరకూ జరిగినట్టుగా సమాచారం. బ్రేక్ ఈవెన్ లోకి రావాలంటే ఖర్చులన్నీ కలుపుకుని 33 కోట్లు రావాలి. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత మొత్తం సాధించడం కష్టం కనుక, ఓవర్సీస్ పై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.